Prayers

దైవసేవకుడు బ్రదర్ జోసఫ్ తంబిగారి ప్రార్ధనలు
Prayer for the Beatification and Litany


Prayer for the Beatification

God our Father, your servant Brother Joseph Thamby gave witness to your son, Jesus Christ, by a radical living of the Gospel in his life and by proclaiming it to the poor with great missionary zeal and Franciscan simplicity. May his total commitment to Christ, filial devotion to the blessed virgin, untainted loyalty to the church and compassionate love for the poor be an inspiration for all of us in our work of evangelization. We implore you to count him among your saints, if it serves your plan of salvation of the people.

Mary our Blessed Mother, Saint Joseph, Saint Francis of Assisi and all the saints, intercede before the Triune God for the Beatification of Brother Joseph Thamby. Look kindly on the innumerable people who flock to your lowly servant, imploring your graces through his intercession.

Loving Father, we humbly beg of you to grant us this favor through the intercession of Brother Joseph Thamby, so that your name be glorified in the world. We make this prayer through Christ our Lord. Amen.



స్వామీ కృపగా నుండండి, స్వామీ కృపగా నుండండి
క్రీస్తువా కృపగా నుండండి, క్రీస్తువా కృపగా నుండండి
స్వామీ కృపగా నుండండి, స్వామీ కృపగా నుండండి
క్రీస్తువా మా ప్రార్ధన విననవధరించండి, క్రీస్తువా మా ప్రార్ధన ప్రకారం దయచేయండి
పరలోకమందున్న పితయైన దేవా, మా మీద దయగానుండండి
లోకరక్షకుడైన సుతుడైన దేవా, మా మీద దయగానుండండి
జ్ఞానవరములిచ్చు పవిత్రాత్మ దేవా, మా మీద దయగానుండండి
పునీత ఫ్రాన్సిసువారి ఆదర్శములననుసరించిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
పునీత ఫ్రాన్సిసువారికి ప్రియశిష్యుడైన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
శాంతికి సాధనమైన బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
క్రోధమున్నచోట ప్రేమనుజూపిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
సందేహములో విశ్వాసమును ప్రకటించిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
హానిగలచోట క్షమను ప్రదర్శింపజేసిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
నిరాశగల తావుల్లో ఆశాకిరణమైన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
చీకటిలో వెలుగుతారవైన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
దు:ఖములో సంతోషమును ప్రకటించిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
కష్టములోనున్న వారిని ఓదార్చిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
చిన్ననాటనే ఇల్లు విడచివెళ్ళిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
క్రీస్తు సేవకై బంధు ప్రేమను తృణీకరించిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
క్రీస్తు రాజ్యస్థాపనకై పలుప్రాంతాలు పర్యటించిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
బాల బాలికలకు సత్యోపదేశము భోదించిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
ఎక్కువగా ప్రార్ధన, దానధర్మములు చేయుమని చెప్పిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
క్రైస్తవసంఘాన్ని దైవపూజలకు నడిపించిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
నూతన విచారణల ఏర్పాటుకు తోడ్పడిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
సువార్తను మక్కువగా ప్రచారము చేసిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
అద్భుత క్రియలతో రోగులను స్వస్థత పరచిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
స్లీవగుర్తుచే వ్యాధులను బాగుచేసిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
వైద్యులకు అసాధ్యమైన వ్రణములను రూపుమాపిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
విశ్వాసమును ప్రజల హృదయాలలో నాటిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
సంతానం లేని వారికి సంతానం ప్రసాదించిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
కుంభవర్షమునందు బట్టలైన తడవని, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
పంచాగాయముల వేదనను ఓర్పుతో సహించిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
అదృశ్యగమనముతో పయనించిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
ఒకే సమయాన రెండు చోట్ల కనిపించిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
తపోశక్తితో దయ్యములను పారద్రోలిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
జరగబోవు విషయాలను ముందుగా ప్రవచించిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
స్వల్ప భోజనమును అనేక మందికి వడ్డించిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
పరుల మనస్సులోని దురుద్దేశములను వెల్లడించిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
దుర్మార్గులను సన్మార్గులుగా మలచిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
జేసునాధుని దివ్యదర్శనమును పొందిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
ప్రతి ఇంట జపమాలను చెప్పించిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
గిరిజనుల మధ్య కష్టములను అనుభవించిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
నింద అవమానము యెడ సహనము చూపిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
మూడు నెలలముందే మరణమును ఎరుక చేసిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి
మరణానంతరం అనేక అద్భుతాలను చేసిన, బ్రదర్ జోసఫ్ తంబిగారా, మా కొరకు వేడుకొనండి

సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకముయొక్క పాపములను పరిహరించెడివారా! మా పాపాలను మన్నించండి స్వామీ.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకముయొక్క పాపములను పరిహరించెడివారా! మా ప్రార్ధన విననవధరించండి స్వామీ.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకముయొక్క పాపములను పరిహరించెడివారా! సర్వేశ్వరుని పరిశుద్ద మాతా మాకొరకు ప్రార్ధించండి.

త్యాగమును, సహనమును, ప్రేమను మూర్తీభవించిన ఓ బ్రదర్ జోసఫ్ తంబిగారా! మా కొరకు వేడుకొనండి. "3 సార్లు"

ధన్యత పట్టము కొరకు ప్రార్ధన

పరిశుద్ధుడవైన మా తండ్రీ! మీ సేవకుడగు బ్రదర్ జోసఫ్ తంబి, క్రీస్తు వాక్యానుసారముగా జీవిస్తూ, ప్రకటిస్తూ, పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి అడుగు జాడలలో నిరాడంబర జీవితము జీవించి మీ కుమారుడైన క్రీస్తుకు సాక్ష్యమిచ్చెను. క్రీస్తుకు తన సంపూర్ణ జీవితము సమర్పించి, సువార్తను ప్రకటించి, తిరుసభ యెడల విధేయతచూపించి, దేవమాత యెడల భక్తిని, బీదలపట్ల కరుణను చూపుటలో మాకు మార్గదర్శకముగా ఉండునట్లు దయచేయండి. మీ చిత్తమైనచో మీ సేవకుడగు జోసఫ్ తంబిగారిని మీ పరిశుద్ధుల సమూహములో చేర్చుకొనండి.

పరిశుద్ధ మరియమ్మగారా, పునీత జోజప్పగారా, అస్సీసిపుర ఫ్రాన్సిసుగారా, సకల పునీతులారా! బ్రదర్ జోసఫ్ తంబిగారియొక్క ధన్యతపట్టం కొరకు త్రియేక దేవుని సన్నిధిలో వేడుకొనండి. ప్రభు రక్షణకార్యము ఈ లోకములో కొనసాగునట్లు బ్రదర్ జోసఫ్ తంబిగారిని మీ సాధనముగా వినియోగించండి.

మా ప్రేమగల తండ్రీ! మా విన్నపమును .................. బ్రదర్ జోసఫ్ తంబిగారి మధ్యస్థ ప్రార్ధన ద్వారా అనుగ్రహించండి. మా ఈ మానవులను మా నాధుడైన యేసుక్రీస్తుద్వారా మనవి చేయుచున్నాము తండ్రీ. ఆమెన్.

1 పరలోక జపం, 1 మంగళ వార్త జపం, 1 త్రిత్వైక స్తోత్రం